Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
BJP presidential candidate Bihar Governor Ram Nath Kovid
రాష్ట్రపతి అభ్యర్థి మీద ఎప్పటినుంచో కొనసాగుతున్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. ఆ పార్టీ తరపున బీజేపీ అభ్యర్థి ఎవరన్నదానిపై ఎప్పటినుంచో చర్చలు సాగుతున్నాయి. ఎంతో కసరత్తు జరిగింది.ఎన్నెన్నో పేర్లు వినిపించాయి.కానీ ఒక్కసారి కూడా ఈ రేసులో పేరు వినిపించని అభ్యర్థిని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది.ఆయనే బీహార్ గవర్నర్ రామనాధ్ కోవిద్. దాదాపు 12 ఏళ్ళ పాటు రాజ్యసభ కి ప్రాతినిధ్యం వహించిన రామనాధ్ కోవిద్ దళిత వర్గానికి చెందినవారు. దేశ రాజకీయాల రాజధానిగా చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ ఈయన సొంత రాష్ట్రం.కాన్పూర్ కి చెందిన కోవిద్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.
రాష్ట్రపతి అభ్యర్థి మీద ఎంతో కసరత్తు చేసిన బీజేపీ చివరకు కోవిద్ ని nda తరపున బరిలోకి దింపాలని నిర్ణయించింది.పార్లమెంటరీ బోర్డు తో సమావేశం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.బీజేపీ కి కొత్త శక్తి ఇచ్చిన యూపీ నుంచి దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి మోడీ అండ్ కో రాజకీయ చతురత ప్రదర్శించారు.
మరిన్ని వార్తాలు: