వరసగా ఆరోసారి అధికారం దక్కినా బీజేపీ కి కిక్ లేదబ్బా.

Bjp victory in gujarath 6th time

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ గుజరాత్ లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికార పీఠం మీద కూర్చోబోతోంది. పటేల్ రిజర్వేషన్ ఉద్యమం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ప్రచార అస్త్రాలుగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద ఎన్నో సందేహాలు . కాంగ్రెస్ గెలుస్తుందేమో అని అక్కడక్కడా ఆశలు . అయినా అవేమీ ఫలించలేదు. కాంగ్రెస్ మరీ పరువు పోకుండా గట్టి పోటీ ఇచ్చిందన్న గౌరవాన్ని దక్కించుకుంది. యుద్ధ పరిభాషలో చెప్పాలంటే పోరాడి ఓడారు. గుజరాత్ లో గెలవకపోయినా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ మీద సానుకూల ప్రభావం పడింది. నిన్నమొన్నటిదాకా ఆయన్ని పప్పు అన్నవాళ్ళు ఇకపై ఆ మాట వాడే అవకాశం ఉండకపోవచ్చు.

gujarath

ఇక మోడీ , బీజేపీ విషయంలో గుజరాత్ లో 6 వ సారి గెలిచిన సంతోషం కనిపించడం లేదు. ఆ కిక్ , జోష్ ఎక్కడా లేదు. హమ్మయ్యా గట్టెక్కాం అన్న కొద్దిపాటి రిలీఫ్ తప్ప ఎక్కడా విజయోత్సాహం కనిపించకపోవడానికి ఎన్నో కారణాలు వున్నాయి. కాంగ్రెస్ ని ఘోర పరాజయం పాలు చేయగలిగితే మోడీ , అమిత్ షా కలగన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ కి అడుగులు పడేవి. కానీ గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని దేశం మొత్తానికి అర్ధం అయ్యింది. ఏది మోడీ కంచుకోట అని ఫీల్ అయ్యారో అక్కడే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా వుందో మోడీ అండ్ కో కి అర్ధం అయ్యివుండాలి. ఇక హిమాచల్ లోను బీజేపీ ఊహించిన ప్రభంజనం లేదు. ఈ నేపథ్యంలో గెలుపుని మాత్రమే తీసుకుని దాని కోసం పడ్డ పాట్లు , అది నేర్పిన పాఠాలు మర్చిపోతే మాత్రం 2019 లో మోడీకి గడ్డు కాలం తప్పదు.

There-is-no-joy-in-winning-