Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి కానీ… కర్నాటక లో నాలుగుదశాబ్దాలుగా సాగుతున్న ఆనవాయితీ మాత్రం ఈ సారి ఎన్నికల్లోనూ తప్పలేదు. కర్నాటకలోని సిరాహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే… రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు, గత ఎన్నికల్లోనే కాదు… గడిచిన నాలుగు దశాబ్దాలుగా జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఐదు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే… ఆ పార్టీకే అధికారం దక్కుతోంది. ఈ సారీ ఇదే సంప్రదాయం కొనసాగింది.
`సిరాహట్టిలో బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లమాని విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమణి రామకృష్ణ సిద్ లింగప్ప పై రామప్ప సోబెప్ప గెలుపొందారు. 2013 ఎన్నికల్లో దొడ్డమణి విజయం సాధించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి గెలవడంతో… ఆ పార్టీ అధికారం చేపడుతుందని కన్నడిగులు అనుకుంటున్నారు. మొత్తంమీద సిరాహట్టి మరోమారు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.