మోడీ ఏమి మాయ చేశావ్ !…కాంగ్రెస్ ఓటమికి కారణాలివేనా ?

reasons behind congress defeat on karnataka elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఎన్నికల ఫలితం ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా కాషాయ పార్టీ కర్ణాటకను చేజిక్కించుకోవడం అనేది ఇక లాంచానమే అని తేలిపోయింది. దాదాపు మ్యాజిక్ ఫిగర్ కి తగ్గ సీట్లలో ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం దాకా సాగిన హంగ్ ఊహాగానాలకి తెరదించుతూ బీజేపీ స్వతంత్రంగానే గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఇక కర్నాటకలో అసలు పొత్తు ప్రశ్నే లేదని కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రకటించేసారు. నిన్నటి దాకా అనుమానాలతో జేడీఎస్ వంక దొంగ చూపులు చుసిన బీజేపీ ఇప్పుడు తామే సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించుకుంది.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ దే కర్ణాటాక అని భావించిన తరుణంలో బీజేపీ గెలుపొందడం అనేక ప్రశ్నలకి తావిస్తోంది. నోట్ల రద్దు మొదలు మొన్నటి జీఎస్టీ, ఎన్నికల అయిన తెల్లారే పెంచిన పెట్రోలు రేట్లు సహా మోడీ నిర్ణయాలు సామాన్య ప్రజానీకానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ చర్యల వల్ల దేశవ్యాప్తంగా రోజురోజుకు మోడీ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. మోడీ తీసుకొచ్చిన పథకాలు కూడా జనరంజకంగా లేక అసలు ఫలానా పధకం మేము చేపట్టాము అని బీజేపీ నేతలు చెప్పుకోలేని పరిస్థితి. అయితే మోడీ వల్ల బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఏర్పడిన కర్ణాటకలో బీజేపీ ఎలా గెలవబోతోంది. గత బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. లింగాయత్ లకి మైనారిటీ హోదా సహా పలు గెలిపించే సూత్రాలని అమలు చేసినా మోడీ ఎలా మాయ చేసాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుండి ఎలక్షన్ ప్లానింగ్ మీద ద్రుష్టి పెట్టకపోవడం కాంగ్రెస్ కి మైనస్ అయితే అమిత్ షా వంటి ఎన్నికల ప్లానింగ్ ఉద్దండులను మొహరించి బీజేపీ ఎంతో పకడ్బందీగా కర్ణాటక ఎన్నికలకు సిద్ధమైంది. దాదాపు 50వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కర్ణాటకలో మోహరించిందంటే ఈ ఎన్నికల కోసం బీజేపీ ఎంత వర్క్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక బీజేపీ స్టార్ క్యామ్పైనర్ ప్రధాని మోడీ సహా ఎంతో మంది బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులను కర్ణాటకలో ప్రచారానికి దింపి ఉధృతం చేసింది. ఇక ధన ప్రవాహం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూయాల దాకా నగదు, వస్థువులు అంధ చేసి, కొన్ని వేల కోట్ల రూపాయల మద్యాన్ని ఏరుల్లా పారించారు. ఇలా అన్ని విషయాల్లో అగ్ర నేతలే రంగంలోకి దిగి కష్టపడితే సిద్ధిరామయ్య – రాహుల్ లు గెలుపు ధీమాతో కాస్త నిర్లక్ష్యంగా ట్విట్టర్ యుద్ధం చేసి బొక్కబోర్లాపడ్డారు.

కర్నాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లింగాయత్‌లకు మైనారిటీ హోదా కల్పిస్తామని ప్రకటించి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. బీజేపీకి మద్దతు పలుకుతున్నలింగాయత్‌లు కాంగ్రెస్‌ వైపు తిరిగితే మరోమారు గద్దెనెక్కవచ్చని కాంగ్రెస్ భావించింది. అయితే ఈ ప్లాన్ ఫలించక పోవడం కూడా కాంగ్రెస్ ని ఓటమి వైపు అడుగులు వేయిస్తోంది. లింగాయత్ల వోట్ ల మీదున్న నమ్మకంతో ఎప్పటినుంచో కాంగ్రెస్ కు అండదండగా ఉన్న ముస్లిం – దళిత ఓటు బ్యాంకును బుజ్జగించకుండా ఆ వోట్లు జేడీఎస్ కి చీలేలా చేశారు. ఎంఐఎం బీఎస్పీ లాంటి పార్టీలు జేడీఎస్ కు అండగా నిలవడంతో ఎప్పుడు కాంగ్రెస్ కు పడే ఓట్లు కూడా చీలి బీజేపీ లాభపడింది. అదే కాంగ్రెస్ చిన్న పార్టీలను కలుపుకు పోయుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.