కాంగ్రెస్స్ పార్టీ లో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేరేందుకు సిద్ధం అయ్యారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు ల ఆధ్వర్యం లో కాంగ్రెస్ లో చేర బోతున్నారు.గతం లో ప్రియాంక గాంధీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ లో చేరి న ఒదెన్న తిరిగి బీఆర్ఎస్ లో చేరాడు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరనున్నారు.
ఈయన రాజకీయాన్ని ఓసారి పరిశీలించినట్టయితే.. టీఆర్ఎస్ తరపున 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వ ఉమ్మడి ఏపీ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు. 2010 ఫిబ్రవరి 14న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన ఓదేలు 2010 జులై 30న జరిగిన ఉపఎన్నికలో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. తెలంగాణ చీఫ్ విప్ గా కూడా నియమితులయ్యాడు ఓదెలు. టీఆర్ఎస్ పార్టీకి 2022 మే 19న రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. కేటీఆర్ సమక్షంలో 2022 అక్టోబర్ 05న ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ లో చేరాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఓదెలు సిద్ధమయ్యాడు .