కవిత విచారణకు హాజరు కావాల్సిందేనన్న ఈడీ…!

Relief for MLC Kavita in liquor scam...!
Relief for MLC Kavita in liquor scam...!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది . అయితే నిన్న ఈడీ నోటీసులు జారీ చేసింది. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని కవిత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారాలను దాఖలు చేస్తూ సవాల్ చేసింది ఎమ్మెల్సీ కవిత. ఈనెల 26 వరకు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ను వాయిదా వేసింది.

ఈడీ సమన్లను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఓ కేసు వేసింది కవిత. ఈ వాదనలు జరుగుతున్న సమయంలోనే ఈడీ నోటీసులు ఇవ్వడంతో దానిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించిన ఈడీ.. కావాలంటే మరో పది రోజుల సమయం ఇస్తామని.. విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది . ఈ నేపథ్యంలోనే కోర్టు విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పలువురు లాయర్లతో చర్చించి.. కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రగతి భవన్ కి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నట్టు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ ని కలిసే అవకాశముంది.