ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. పశ్చిమ కాబూల్‌లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు వెల్లడించారు. మరణించిన, గాయపడినవారు షియా హజారా కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు.
వీరు తరచు ఇస్లామిక్ స్టేట్, సున్నీ తీవ్రవాద గ్రూపులచే టార్గెట్ అవుతున్నారు. పేలుడు మూడు చోట్ల జరిగిందని, షియా ప్రజలు కొంత మంది ప్రాణాలు కోల్పోయారని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.