హర్రర్ మూవీస్ ను తలపించేలా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు మనం సినిమాల్లోనే చేస్తుంటాం. అది ఇప్పుడు నిజ జీవితంలో గోచరమైంది. ఓ యువకుడు తన గదిలో గోడలో నుంచి నల్లగా, చిక్కగా ఉన్న ద్రవం కారడం చూశాడు. సీలింగ్ నుంచి కిందవరకు ఉన్న ఆ ద్రవం దుర్వాసన వస్తుండటంతో పై ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాడు. గోడకు మేకు కొడితే.. అందులో నుంచి రక్తం వస్తుంది. అక్కడ ఏముందా? అని పగలగొట్టి చూస్తే.. భయంకరమైన రీతిల శవం దర్శనమిస్తుంది. బీభత్సకరంగా ఉండే ఇలాంటి సన్నివేశాలతోనే హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తారు. ఇది నిజంగా అమెరికాలో జరిగింది.
అమెరికాలోని మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నగరంలో నివసిస్తున్న ఏజే మెక్క్రాడీ అనే యువకుడు తన స్నేహితుడి ఎవైన్ షుల్జ్ కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటన్నారు. ఈ మధ్యనే అతడి ఫ్లాట్‌లో ఓ గోడ నుంచి నల్లని ద్రవరూపంలో ఏదో కారుతున్నట్లు గమనించాడు. అది చాలా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఆ చిక్కని ద్రవం ఏమిటనేది వారికి అర్థం కాలేదు. దాన్ని పరీక్షించి చూస్తే…అది గోడ నుంచి కాదని.. సీలింగ్‌కు గోడకు మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ నుంచి వస్తుందని తెలుసుకున్నారు.
కాగా కొద్ది రోజులుగా లీకవుతున్న తమ బాత్రూమ్ వల్ల అది ఏర్పడి ఉండవచ్చని అంతా భావించారు. ఇదే భావనతో మెయిటెనెన్స్ వర్కర్లను పిలిపించారు. బాత్రూమ్లో మరమ్మతులు చేసిన తర్వాత.. ఆ ద్రవాన్ని పరిశీలించారు. దాన్ని తుడిచేందుకు ప్రయత్నించగా.. నల్లగా ఉన్న ఆ ద్రవం ముదురు ఎర్ర రంగులో కనిపించింది. ఆ లీకేజీ తమ ఇంట్లోనే వస్తుందా? లేదా పైఇంట్లో ఏదైనా ద్రవం కిందపడి లీకవుతుందా? అని చూశారు. తమ ఇంట్లో ఏర్పడిన లీకేజీ వాళ్ల ఇంట్లో కూడా వస్తుందా? లేదా? అని తెలుసుకొనేందుకు ఏజే పై ఫ్లాట్‌లోకి వెళ్లి అందులో ఉంటున్న వ్యక్తిని పిలిచారు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. తలుపు లోపల నుంచి గడియ పెట్టి లేకపోవడంతో ఏజీ, అతని మిత్రుడు లోపలికి వెళ్లారు. తలుపు తీయగానే ముక్కు పగిలిపోయేంత దుర్వాసన వచ్చింది.
దీంతో అతడి గుండె దడ మొదలైంది. నిజంగా హర్రర్ సినిమాని తలపించేలా ఉందని భావించాడు. ఇంట్లో ఎవరూ లేరని భావించిన అతను బెడ్రూమ్లోకి వెళ్లి చూసి షాక్ కు గురయ్యారు. ఆ ఫ్లాట్ బెడ్రూమ్లో శవం దర్శనమిచ్చింది. దీంతో వెంటనే ఏజే పోలీసులకు తెలిపాడు. పోలీసులు అక్కడికి వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడు సుమారు వారం రోజుల కిందట చనిపోయాడని.. అతడి నుంచి రక్తం సీలింగ్, గోడ మధ్య (సహజంగా చెక్క ఇళ్లల్లో ఇలాంటి లీకేజీలు ఏర్పడుతుంటాయి) ఉండే ఖాళీ నుంచి లీకైందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఆ యువకుడు ప్రత్యక్షంగా హర్రర్ సినిమాను చూసి షాక్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.