Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ జంపింగ్ లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ లో ఉండి, లేదా తెలుగుదేశంలో ఉంది తమకి సరయిన ప్రాధాన్యం లేదని భావించే నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జగన్ యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్, అలాగే ఆ జిల్లా నేత బొత్సా సత్యనారాయణల సమక్షంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి చిన అప్పలనాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1983 ఇండిపెండెంట్‌గా 1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పలనాయుడు 1994లో టీడీపీ విప్‌గా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన అప్పలనాయుడు ఓటమి పాలయ్యారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.