బాబీ, బాలకృష్ణ ప్రాజెక్ట్ అప్డేట్ అదిరిపోయింది..మీరు చూసారా..?

బాబీ, బాలకృష్ణ ప్రాజెక్ట్ అప్డేట్ అదిరిపోయింది..మీరు చూసారా..?
Cienma News

ఇటీవల భగవంత్ కేసరి మూవీ తో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ మూవీ కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీరసింహా రెడ్డి చిత్రాల తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసేసింది . బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ని అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న బాలయ్య.. ఇప్పుడు తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీ తో హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బాబీ… ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నారు . గత కొన్ని నెలల క్రితమే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అప్పటి నుంచి ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త ఫోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

బాబీ, బాలకృష్ణ ప్రాజెక్ట్ అప్డేట్ అదిరిపోయింది..మీరు చూసారా..?
BalaKrishna

బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చిత్రయూనిట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసింది. గొడ్డలికి కళ్లజోడు పెట్టి, ఆంజనేయస్వామి బిళ్ల ఉన్న దండ వేసి ఉండగా.. ఆ కళ్లజోడులో అవతల జరిగే పోరాట సన్నివేసాలు చూపిస్తున్నట్లు ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ చూస్తూ ఉంటె … ఈ మూవీ తో మరోసారి యాక్షన్ విధ్వంసం సృష్టించిందేకు బాలయ్య రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్, వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ అంటూ బాలకృష్ణ గురించి చెబుతూ పోస్ట్ చేశారు.