ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే దాదాపు మూవీ షూటింగ్ పూర్తి కవస్తుండగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ ఫస్ట్ సింగిల్ పై కూడా అందరిలో మంచి ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మూవీ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు లేటెస్ట్ గా బాలయ్య డాకు మహారాజ్ విలన్ బాబీ డియోల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వీరమల్లు లో కూడా తాను విలన్ గానే నటిస్తుండగా ఇపుడు డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి.
హరిహర వీరమల్లు స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్ అని చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయని గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్ గా మాస్ గా కూడా ఉంటాయని మొదటిసారి కథ విన్నపుడే ఎంతో నచ్చింది అని అలాంటి మూవీ లో భాగం అయ్యినందుకు ఆనందంగా ఉందని బాబీ తెలిపారు. దీనితో తన కామెంట్స్ ఇపుడు పవన్ అభిమానుల్లో తేగా వైరల్ అవుతున్నాయి .