బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెసియా అధికారికంగా విడిపోయారు. ఇరవై ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్య మెహర్ జెసియాను విడాకులు కోరిగా ఇందుకు మెహర్ జెసియా సమ్మతం తెలపడంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం వల్ల జడ్జి శైలజా సావంత్ ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి విడాకులు మంజూరు చేశారు.
ప్రస్తుతం“రాక్ ఆన్” ఫేమ్ అర్జున్‌రాంపాల్ మాట్లాడుతూ మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించి కొత్త జీవితం ఆరంభించాలని అనుకుంటున్నమని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అర్జున్ రాంపాల్ మెహర్‌ను1998లో వివాహం ఆడాడు. ఇద్దరు కుమార్తెలు మహిక, మైరా ఉన్నారు. అర్జున్ రాంపాల్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తు ఉండగా వీరికి మగ బిడ్డ కూడా జన్మించింది. ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది.