మీ టూ ఉద్యమం ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా వాడీ వేడీగా సాగుతోంది. ఇక బాలీవుడ్లో ఈ ఉద్యమం ఏ రేంజ్లో జరుగుతోంది. బాలీవుడ్లో వరుస చిత్రాల్లో నటిస్తున్న అమైరా దస్తూర్ తాజాగా మీ టూ ఉద్యమంలో భాగంగా చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక స్టార్ హీరో అల్లుడు తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ చెప్పుకొచ్చింది. మీద చేతులు వేస్తూ, తన మాటలతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని దర్శకుడికి చెబితే ఇక అంతా కలిసి నన్ను టార్గెట్ చేశారు. నిజానికి బాలీవుడ్లో కంటే సౌత్‌లో ఎక్కువగా ఈ వేధింపులు ఉంటాయి అంటూ అమైరా చెప్పుకొచ్చింది.
ఆ హీరో చేసే అసభ్యకర వేశాలు సదరు దర్శకుడికి చెబితేనే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అతని విషయం బయటకు చెబితే ఇక నా కెరీర్ అంతా నాశనమే, ఆ హీరో పేరు చెబితే నాకు అవకాశాలు కూడా రావు కానీ త్వరలో అతడి పేరు కచ్చితంగా బయట పెడతాను, అతను చాలా మందితో కూడా ఇలాగే ప్రవర్తించినట్టు నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పక్కా ఆధారాలతో అతని విషయాన్ని బహిరంగ పర్చుతాను అని అమైరా చెప్పడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే అమైరా చేసిన ఆరోపణలు తమిళ హీరో అల్లుడిపై అయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ ఆరోపణలు కొందరు పబ్లిసిటీ కోసం కూడా చేస్తున్నారు. మరి వీటిలో ఏవి నిజమో ఇప్పుడే తేల్చలేం.