హైదరాబాద్ లో పేలుడు…అలా జరిగిందే ?

హైదరాబాద్ లో పేలుడు...అలా జరిగిందే ?

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌లో పేలుడు సంభవించింది. పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఫుట్‌పాత్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ డబ్బాను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి చేతులు ఛిద్రమైపోయాయి. వెంటనే స్థానికులు అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనలకు గురయ్యారు. మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన యాచకుడు అలీగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు.. పేలుడు ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అది బాంబు బ్లాస్ట్‌ కాదని, కెమికల్‌ బ్లాస్ట్‌ అని తెలిపారు.

వేరే ప్రాంతం నుంచి ఆ బాక్సును అలీ తీసుకు వచ్చారని అన్నారు. అయితే ఆ కెమికల్‌ ఎక్కడినుంచి వచ్చింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఆ బాక్సు అలీ ఎక్కడి నుంచి తెచ్చాడు..?  అర్గానికి కెమికల్ సాల్వెంట్ అక్కడికి ఎలా వచ్చిందన్నదానిపైన విచారణ జరుగుతోంది. సంఘటనా స్దలంలో సీసీ కెమెరాలను పరీశీలించారు పోలీసులు. అలీ డబ్బాలను తెరవడంతోనే పేలుడు జరిగిందని నిర్థారణకు వచ్చారు. పేలుడుకు సంబందించిన పూర్తివివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. స్థానికంగా ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీల్లోని ఆర్గానిక్‌ కెమికల్‌ లిక్విడ్‌ మూలంగా పేలుడు జరిగిందని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వస్తే పూర్తి క్లారిటీ ఇస్తామంటున్నారు డిసిపి ప్రకాశ్‌రెడ్డి . ఇది బాంబు పేలుడు కాదన్న ఆయన మృతుడు అలీ కదలికలను సీసీటీవీ లో గుర్తించామన్నారు. నిమజ్జనానికి తరలివెల్లే భక్తులు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదంటున్నారు.