అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి సుప్రీంకోర్టులో తనిఖీలు చేపట్టారు. కాగా జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇది జరగడం ఆసక్తికరంగా మారింది. కాగా భారత కాలామానం ప్రకారం రాత్రి 10.30గంటలకు క్యాపిటల్ హిల్ భవనంలో జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. కాగా జో బైడెన్‌తో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించనున్నారు.