20 టైటిల్స్‌ ఎందుకు బోణీ?

boney Kapoor registered 20 titles in Sri Devi biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి నెలలు గడుస్తుంది. అయినా కూడా ఇప్పటికి ఆమె జ్ఞాపకాలు ప్రతి సినీ అభిమానిని తొలుస్తూనే ఉన్నాయి. ఆమె నటించిన సినిమాలు ప్రతి రోజు ఏదో ఒక ఛానెల్‌లో వస్తూనే ఉన్నాయి. దాంతో ఆమెను మరిచి పోలేక పోతున్నారు. ఈ సమయంలోనే శ్రీదేవి బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. శ్రీదేవి బయోపిక్‌ను హిందీలో తెరకెక్కించి తెలుగు, తమిళం, మలయాళంలో డబ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి బయోపిక్‌ను ఆమె భర్త బోణీ కపూర్‌ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న బయోపిక్‌కు 20 టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

ముంబయి ఫిల్మ్‌ ఛాంబర్‌లో బోణీకపూర్‌ తన బ్యానర్‌లో ఏకంగా 20 టైటిల్స్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. అవన్ని కూడా శ్రీదేవి బయోపిక్‌ కోసం అంటూ సమాచారం అందుతుంది. ఒక్క సినిమాకు 20 టైటిల్స్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం ఏంటని అంతా ఆశ్చర్య పోతున్నారు. శ్రీదేవి బయోపిక్‌ విషయంలో బోణీకపూర్‌ ప్లాన్‌ ఏంటని, ఒకటికి మించిన బయోపిక్‌లు తీస్తాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీ, శ్రీదేవి, మామ్‌ శ్రీదేవి, శ్రీ మేడమ్‌, మేడమ్‌ శ్రీదేవి, శ్రీదేవి స్టార్‌, స్టార్‌ స్టార్‌ శ్రీదేవి ఇలా పలు టైటిల్స్‌ను బోణీ రిజిస్ట్రర్‌ చేయించారట. ఇక బోణీకపూర్‌ తెరకెక్కించబోతున్న శ్రీదేవి ఆటోబయోపిక్‌లో శ్రీదేవి పాత్రను ఆమె పెద్ద కూతురు జాహ్నవి పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే దేశ వ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాగే సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.