శాసన మండలి రద్దు విషయం ఫై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మీడియా తో మాట్లాడిన బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి అవసరమా అని అడిగారన్న విషయాన్నీ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ అంశం పైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా బొత్స టీడీపీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ శాసన మండలి నిబంధనలను తుంగలో తొక్కిందని విమర్శించారు. శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే శాసన మండలి లేకున్నా తమకు వచ్చే నష్టం లేదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్సీ లని ప్రలోభ పెడుతున్నారు అంటూ టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని బొత్స అన్నారు. శాసన మండలి రద్దయితే నారా లోకేష్ పదవి పోతుందనే భయం చంద్రబాబు కి పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. శాసన మండలిలో జరిగే పరిణామాలను టీడీపీ కి వంతపాడే ఈనాడు సమర్ధిస్తుందా? అంటూ ఎద్దేవా చేసారు. అయితే 1983 లో టీడీపీ కి బలం లేనపుడు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసిన బొత్స, ఇపుడు టీడీపీ కి మెజారిటీ ఉందని రద్దుకు వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. బొత్స చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.