బాలికకు ఓ యువకుడు మాయమాటలు చెప్పాడు. .పెళ్లి చేసుకుంటాను.. కళ్ల ల్లో పెట్టుకుని చూసుకుంటాను.. అని నమ్మబలికా డు. ఆమెను వంచించి తల్లిని చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలైన మైనర్ ఆందోళనకు దిగింది. ఆమెకు గ్రామస్తులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రేమపేరుతో వంచించి తల్లిని చేసి ఇప్పుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని బాధిత మైనర్ అంగన్వాడీ కేంద్రం వద్ద స్థానిక మహిళలతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగింది. కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ దోమలగొందికి చెందిన బాధిత మైనర్ (17) మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి తల్లిని చేశాడని చెప్పింది. దీనిపై 2019 డిసెంబర్లో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్కు తరలించారని చెప్పింది. అతను బయటకు వచ్చిన తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరింది.