లాక్ డౌన్ కాలంలో కూడా ఘోరాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో అత్యంత ఘోరమైన విషయం వెలుగు చూసింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని.. మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల వయసున్న బాలుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఆ బాలుడి అత్యాచార యత్నాన్ని ఆ చిన్నారి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆ తర్వాత బాలికను ఆబాలుడు కొట్టి చంపేశాడు. అయితే ఈ ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణసముద్రంలో తాజాగా చోటుచేసుకుంది.
కృష్ణసముద్రం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు.. చిన్నారిపై చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఏదోలా మాయమాటలు చెప్పిన బాలుడు ఆ బాలికను గ్రామానికి సమీపంలో ఉన్న మల్లెపూల తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆ అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తీవ్రమైన కోపానికి గురైన ఆ బాలుడు బాలిక తలపై బండరాయితో కొట్టాడు. చిన్నారి స్పృహ కోల్పోయింది. గ్రామంలోకి వచ్చిన అతను.. ఏమీ తెలియనట్లు చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని స్థానికులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని విచారించగా మొదట తనకేం తెలియదని చెప్పాడు.,. ఆ తర్వాత పోలీసు ప్రశ్నలకు తబ్బిబ్బై అసలు విషయం చెప్పేశాడు. కాగా ఆ చిన్నారిని హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలుడిని జువైనల్ హోంకు తరలించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.