టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రంకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో తెరకెక్కబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లకు జక్కన్న తనకు సెప్టెంబర్ నుండి పూర్తిగా డేట్లు కేటాయించాల్సిందే అంటూ చెప్పాడట. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ వరకు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో జక్కన్న తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఒకవైపు పూర్తి అవ్వబోతున్న సమయంలో రామ్ చరణ్ ఇలా చేయడంతో ఆయన గుస్సాగా ఉన్నాడు.
రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఒక చిత్రం చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కు ఎలాంటి టెన్షన్ లేదు, జులై లేదా ఆగస్టులో ఎన్టీఆర్ తన చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నాడు. దసరాకు చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఈ సమయంలోనే రామ్ చరణ్ తన సినిమాను కూడా పూర్తి చేసేందుకు దర్శకుడు బోయపాటిని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని, లేదంటే రాజమౌళి నుండి మాట వస్తుందంటూ తొందర పెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి జక్కన్న వల్ల ఇప్పుడు బోయపాటి హడావుడిగా తన సినిమాను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు.