మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో “గుంటూరు కారం” అనే పక్కా మాస్ ఫ్లిక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబుకి సరైన మాస్ చిత్రం పడితే ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి కూడా తెలుసు. మరి అలాంటిది మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను లాంటి దర్శకునితో కేవలం ఒక పక్కా కమర్షియల్ మూవీ పడితే ఎలా ఉంటుందో కూడా అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఈ కాంబినేషన్ అయితే ఇంకా పడలేదు కానీ లేటెస్ట్ గా బోయపాటి శ్రీను మహేష్ బాబు పై చేసిన ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మహేష్ బాబు గారితో ఒక కమర్షియల్ సినిమా చేయాలని, మహేష్ ఏదైనా చెయ్యగలరు మాస్ క్లాస్ ఫ్యామిలీ అది ఇది అని లేదు ఆయన ఒక ఆల్ రౌండర్ అని తన మార్క్ మాస్ స్టేట్మెంట్ ని కూడా తెలిపారు. దీనితో మహేష్ పై బోయపాటి రెస్పాన్స్ మంచి వైరల్ గా మారిపోయింది .