Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకోబోయాడు. వెంటనే ఆ ప్రయత్నాన్ని భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. ఆ యువకుడుతో పాటు అనేకమంది తమ వెంట పెట్రోల్ బాటిళ్లు తెచ్చుకుని ధర్నాకు దిగారు. వారంతా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వాసులు. రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లను కూలదోసి నష్టపరిహారం చెల్లించకుండా మూడేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని వారంతా ఆరోపించారు. తమ బాధను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి వద్దకు వస్తే ఆయన తమకు సమయం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదిరోజుల్లోనే నష్టపరిహారం చెల్లిస్తామని అప్పుడు హామీఇచ్చారని..మూడేళ్లయినా ఇంతవరకూ తమకు ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేటంత వరకు ఇక్కడ నుంచి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు.