బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థ వేడుక..హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు ..

బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థ వేడుక..హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు ..
బ్రహ్మానందం

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట్లో చిన్న కొడుకు పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్య తో ఏ పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో సిద్దార్థ్ ఎంగేజిమెంట్ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ వేడుకలోపలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే . వారిలో గౌతమ్ పెద్దవాడు కాగా, సిద్దార్థ్ చిన్నవాడు. మొదటి కుమారుడు గౌతమ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి . కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకి పూర్తిగా దూరం అయ్యాడు .

బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ విదేశాలలో చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు . అతడి గురించి చాలా తక్కువ మండికి మాత్రమే తెలుసు. సిద్ధార్థ్ కు సినిమాల పైన పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అనుకున్నారట.. తాజాగా అతడి పెళ్లి చేయాలనీ ఫిక్స్ అయ్యారట బ్రహ్మానందం గారు దింతో . సిద్ధార్థ్-ఐశ్వర్య వివాహం త్వరలోనే ఉంటుంది అని తెలియజేసారు. ఈ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించాలని బ్రహ్మానందం గారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థ వేడుక..హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు ..
బ్రహ్మానందం