Brahmani not interested in Politics
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి మరోసారి పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఆమె పొలిటికల్ ప్రజెన్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగడం, వచ్చే ఎన్నికలు వైఎస్ భారతి, బ్రాహ్మణి మధ్య పోటీ అనే చర్చ తెరపైకి రావడంతో.. ఆమె వెంటనే స్పందించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, బిజినెస్ చూసుకుంటానని చెప్పేశారు.
మహిళా పారిశ్రామికవేత్తగా ఫిక్కీ సదస్సులో పాల్గొన్న బ్రహ్మణి.. అక్కడే బిజినెస్ గురించి చాలా విషయాలు చెప్పారు. రైతులకు సాధికారత కల్పించడం కోసం పాలకు ఎక్కువ రేటిస్తున్నామని, పంటలు పండినా.. పండకపోయినా హెరిటేజ్ ఇచ్చే రేటుతో రైతులు సాఫీగా జీవనం సాగించవచ్చని బ్రహ్మణి చెప్పారు. ఇంకా రైతుల కోసం హెరిటేజ్ తరపున మరిన్ని సంక్షేమ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఈ సదస్సులో పాల్గొన్న బ్రహ్మణి భర్త లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో మహిళా సాధికారత ఎప్పట్నుంచో ఉందని, అమ్మ, బ్రహ్మణి కష్టపడుతుంటే.. తాను, నాన్న ఖర్చుపెడతామని చెప్పి నవ్వేశారు. దీంతో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ వార్తలకు తెరపడినట్లేనని టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు. కానీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకోకపోవని కొందరు ఆశగానే ఉన్నారు.