పాలనకే పరిమితం.. బీజేపీపై కవిత కామెంట్స్

Kavitha Sensational Comments On BJP

 Kavitha Sensational Comments On BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపుతున్న సీఎంల్లో ఎన్డీఏ పక్షాల కంటే కూడా కేసీఆర్ ఓ అడుగు ముందే ఉన్నారు. అమిత్ షా ను తీవ్రంగా తిట్టి.. మోడీని మాత్రమే పొగడటం కేసీఆర్ దూరదృష్టి అని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పిన మాటలు వింటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న రేంజ్ లో ఉన్నాయి.

కేంద్రానికి పాలనాపరమైన మద్దతు మాత్రమే ఇస్తున్నామని, దేశాభివృద్ధి కోసం సంస్కరణలకు మద్దతిస్తున్నామని కవిత చెప్పిన మాటలు విని పొలిటికల్ పండిట్స్ ఆశ్చర్యపోతున్నారు. పైగా కేంద్రంలో బీజేపీనే కాదు ఏ పార్టీ ఉన్నా.. తమ సహకారం ఇలాగే ఉంటుందని కవిత చెప్పడం.. మరింత చర్చకు తావిచ్చింది. కవిత ఏం చెప్పాలనుకున్నారో.. ఆమె మెనసులో ఏముందోనని కాంగ్రెస్ కూడా భుజాలు తడముకుంటోంది.

పాలనా పరమైన మద్దతే ఉంటుందని, పాలిటిక్స్ జోలికొస్తే అమిత్ షా కు ఇచ్చిన ఆన్సరే అందరికీ కేసీఆర్ ఇస్తారని కవిత హెచ్చరించారు. ఒకేసారి అటు మద్దతు, ఇటు వార్నింగ్ ఎలా సాధ్యమతో తల పండిన రాజకీయ వేత్తలకు అర్థం కావడం లేదు. మొత్తం మీద బీహార్ సీఎం నితీష్ తరహాలో ప్రత్యేక రాజకీయాలు చేస్తున్న కేసీఆర్.. భవిష్యత్తులో ఏ స్టెప్ తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.