‘డీజే’ను బ్యాన్‌ చేయాలట!

brahmins demand to ban DJ movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘దువ్వాడ జగన్నాథమ్‌’ గుడిలో బడిలో… పాట విడులైనప్పటి నుండి కూడా బ్రహ్మణ సంఘాలకు చిత్ర యూనిట్‌ సభ్యులకు పెద్ద యుద్దమే జరుగుతుంది. బ్రహ్మణులు ఎంతో పవిత్రంగా భావించే పదాలను డ్యూయెట్‌కు వాడటంతో బ్రహ్మణ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పదాలను తొలగిస్తామని దర్శకుడు హరీష్‌ శంకర్‌ హామీ ఇవ్వడం, ఆ తర్వాత వాటిని తొలగించక పోవడంతో వివాదం మరింత ముదిరింది. సినిమాను విడుదల కానివ్వం అంటూ బ్రహ్మణులు తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు పదాలు తొలగించారు. ఇక సినిమాకు సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఇవ్వడంతో బ్రహ్మణ సంఘాల వారు ఏం చేయలేక పోయారు. 

నేడు సినిమా విడుదలైన తర్వాత మళ్లీ వివాదం మొదలైంది. చిత్రంలో అల్లు అర్జున్‌ బ్రహ్మణ యువకుడు అనే విషయం తెల్సిందే. ఆయన చెప్పులు వేసుకుని ఎంతో పవిత్రం అయిన గాయత్రి మంత్రాన్ని పఠించాడు అంటూ బ్రహ్మణలు కొత్త వివాదంను లేవనెత్తుతున్నారు. గాయత్రి మంత్రం తమకు పరమ పరిత్రం అయ్యింది, అలాంటి మంత్రంను అవమానించినందుకు సినిమాను బ్యాన్‌ చేయాల్సిందే అంటున్నారు. అలాగే గాయత్రి మంత్రంను అవమానించినందుకు గాను దర్శకుడు హరీష్‌ శంకర్‌కు కులం నుండి వెలివేయాలని కూడా డిమాండ్‌ వినిపిస్తుంది. మొత్తానికి ‘డీజే’ సినిమా విడుదలైన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరిన్నివార్తలు 

‘డీజే’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌

 ‘ఫిదా’ ట్రైలర్‌ రివ్యూ

‘డీజే’ గురించి ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..!