దక్షిణ అమెరికా దేశాలలో అతి పెద్ద దేశం బ్రెజిల్. బ్రెజిల్ పర్యాటకరంగం దేశం లోని పలు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారగా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యా పరంగా బ్రెజిల్ లాటిన్ అమెరికాలో ద్వితీయ స్థానంలో ఉంది. వరల్డ్ పర్యాటకం ఆర్గనైజేషన్ ఆధారంగా బ్రెజిల్‌కు అంతర్జాతీయ ప్రయాణం 2004, 2005 మధ్యకాలంలో వేగవంతంకాగా 2006లో నెమ్మదిగా తరుగుదల జరగగా 2007, 2008లో అంతర్జాతీయంగా వచ్చిన వారి సంఖ్య పెరుగుదల లేదు.
జేర్ బోల్సొనారో గత ఏడాది బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. జేర్ బోల్సోనారో తమ దేశాన్ని భారత పర్యాటకులు వీసా లేకుండానే రావచ్చని ప్రకటించారు. వ్యాపార కోసం తమదేశానికి వచ్చే భారత్‌తో పాటు చైనాకు చెందిన పర్యాటకులకు వీసా లేకుండానే రావచ్చని తెలిపారు. చైనా పర్యటన సందర్భంగా బోల్సోనారో మాట్లాడుతూ అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల పౌరులకు తమ దేశం ఈ సదుపాయాన్ని కలిపించింది అని చెప్పారు. కానీ ఈ దేశాలు మాత్రం బ్రెజిల్ పౌరులకు ఫ్రీ వీసా అవకాశం ఇవ్వలేదు.