Breaking News: ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా

Breaking News: Aruri Ramesh's shirt in the fight between the two groups
Breaking News: Aruri Ramesh's shirt in the fight between the two groups

ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వాహనాన్ని BJPనేతలు అడ్డుకున్నారు. దీంతో జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా చిరిగిపోయింది.

అటు ఆరూరి రమేష్ ను BRSపార్టీ ఇంకా బుజ్జగిస్తోంది . అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరిని BRSనేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. హరీష్ రావు ఆదేశాల మేరకే BRSనేతలు వచ్చామంటున్నారు. హరీష్ రావు ఇవాళ సాయంత్రం వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి BRSనేతలు చెబుతున్నారు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.