హనుమాన్ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చు?

When can Hanuman be seen in OTT?
When can Hanuman be seen in OTT?

యంగ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ హను మాన్(Hanu Man) కోసం అందరికీ తెలిసిందే. మరి మన తెలుగు మూవీ నుంచి మొదటి సూపర్ హీరో మూవీ గా ఇది రావడం హనుమాన్ ఫ్యాక్టర్ కూడా భారీగా ప్లస్ కావడంతో ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా ఇప్పుడు హను మాన్ ఓటిటి (Hanu Man OTT Date) రిలీజ్ డేట్ పట్ల అందరిలో మరింత ఉత్కంఠ నెలకొన్నది . ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ డేట్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా రీసెంట్ గానే ఒక పోస్ట్ చేయగా ఈ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

When can Hanuman be seen in OTT?
When can Hanuman be seen in OTT?

ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో డేట్ రివీల్ చేయమని కోరుకుంటున్నారు. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు జీ 5 వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రస్తుతానికి ఈ మార్చ్ 16 నుంచి రావచ్చని బజ్ ఉన్నది . మరి డేట్ అదేనా కాదా అనే దానిపై అఫీషియల్ క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

ఇక ఈ మాసివ్ హిట్ మూవీ కి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం హను మాన్ సీక్వెల్ “జై హనుమాన్”(Jai Hanuman Movie) పనుల్లో మేకర్స్ చాలా బిజీగా ఉన్నారు.