Breaking News: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Breaking News: Bomb threats to 15 schools in Bengaluru
Breaking News: Bomb threats to 15 schools in Bengaluru

కర్ణాటక రాష్ట్ర ప్రజలను వరుస బాంబు బెదిరింపులు కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఈ వ్యవహారం తీవ్రంగా భయపెడుతోంది. ఇవాళ ఉదయం దాదాపు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. గుర్తు తెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు.

కన్నడ మీడియా కథనాల ప్రకారం..

ఇవాళ ఉదయం సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చినట్లు కన్నడ పోలీసులు తెలిపారు. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యా సంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. ఈ మెయిల్ ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.