ఇవాళ కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత.
- ఈడి కేసులో ఇప్పటికే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు స్పెషల్ కోర్ట్ నిరాకరించింది. ఈ తరుణంలోనే.. మరోసారి ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న అరెస్ట్ చేసింది ఈడి. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.