BREAKING NEWS: పరిశ్రమలో భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులు

BREAKING NEWS: Huge explosion in the industry.. Workers seriously injured
BREAKING NEWS: Huge explosion in the industry.. Workers seriously injured

ఈ మధ్య కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలను నిత్యం తరుచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది పలువురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అని తెలుస్తోంది. భయంతో పరుగులు తీశారు కార్మికులు.. పేలుడు ధాటికి కుప్పకూలింది షెడ్‌.

స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు దాటికి కుప్పకూలిపోయిన చిన్న భవనం. పేలుడు దాటికి ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.శిధిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అని అధికారులు గాలిస్తున్నారు.