కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు, పవన్. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు, పవన్.
తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను భారీ ఎత్తున చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనుంది టీడీపీ – జనసేన. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందంటున్న టీడీపీ, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సీఈసీకి ఇచ్చే రిప్రజెంటేషనులో ప్రధానంగా ప్రస్తావించనుంది. సచివాలయ సిబ్బంది వైసీపీ తరఫున ‘‘జగనే ఎందుకు కావాలనే’’’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేయనున్నారు. అధికారులు, పోలీసుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పట్టించుకోవడం లేదని కంప్లైంట్ ఇవ్వనున్నారు.