Breaking News: ప్రజ్ఞానంద రికార్డ్.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి టాప్‌లోకి

Breaking News: Pragnananda's record.. Viswanathan passes Anand to the top
Breaking News: Pragnananda's record.. Viswanathan passes Anand to the top

చెస్‌ యువ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు. తన కెరీర్‌లోనే తొలిసారిగా చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి భారత టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇవాళ జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)ను ఓడించి ప్రజ్ఞానంద ఈ ఘనత అందుకున్నాడు.

ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉండగా.. విశ్వనాథన్‌ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో నిలిచాడు. దీంతో భారత్‌ తరఫున టాప్‌ ప్లేయర్‌గా యువ గ్రాండ్‌మాస్టర్‌ టాప్ స్థానానికి. మరోవైపు విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత క్లాసికల్‌ చెస్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు.

ప్రజ్ఞానంద సాధించిన ఘనతపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ ఈ గ్రాండ్ మాస్టర్కు అభినందనలు తెలుపుతున్నారు. “నిన్ను చూసి ఈ దేశం గర్వపడుతోంది’’ అంటూ ప్రజ్ఞానందపై అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రశంసలు కురిపించారు. ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.