ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం హయాంలో స్కామ్‌లు జరిగాయంటూ సీఐడీ కేసులు పెడుతూ వస్తుంది. ఇవిగో సాక్ష్యాలు అంటూ కోర్టును ఆశ్రయించి కీలక వ్యక్తులను సైతం అరెస్ట్ చేస్తోంది.. మరోవైపు..వైసీపీ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లో పశువుల స్కామ్ జరిగిందని.. రూ.2,850 కోట్లు దోచేశారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ రోజు మీడియాతో గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. మహిళా సాధికారత కోసం ప్రభత్వం దిగివచ్చిందని ఊదరగొడుతున్నారు.
3.85 లక్షల పసువులు క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని చెబుతున్నారు. 4.75 లక్షల పాడి పశువులు కొనడానికి కేబినెట్ తీర్మానం చేశారు. మార్చి 22 శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 32 కోట్లు పశువులు కొనుగోలుగు కేటాయించామని తెలిపారని.. ఒక్క రోజులో 1.20 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2 లక్షల పశువుసు కొన్నట్లు అధికారులు తెలిపారు. 8 వేల పశువులు మాత్రమే క్షేత్రస్థాయిలో కొన్నారని.. రూ.2,887 కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. సామాన్యులకు అర్థం కాని విధంగా దోపిడికి తెరతీశారు. పశువులు కొనుగోలుపై రూ.2,850 కోట్ల అవినీతి చేశారని విమర్శించారు. ఇక, పశువుల స్కామ్ ను సీఎం ప్రోత్సహించారని నాదెండ్ల మనోహర్ అనుమానం వ్యక్తం చేశారు.