ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు..నేటికి 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు చంద్రబాబు.. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే కాగా.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు.. ఇలా అన్ని కోర్టుల్లో చంద్రబాబుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ సాగుతోంది.. జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలుస్తూ వస్తున్నారు కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు.. చంద్రబాబు కేసులు చూస్తున్న లాయర్లు.. అయితే,ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు లీగల్ ములాఖత్ లను ఒకటికి కుదించారు.
ఇప్పటి వరకు సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి రెండు లీగల్ ములఖాత్‌లు ఇస్తూ వచ్చారు జైలు అధికారులు..ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో.. చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల సంఖ్య ఒకటికి పడిపోయింది.. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఇక నుంచి రోజుకు ఒక ములాఖత్ మాత్రమే ఉంటుందని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.. మరోవైపు వారానికి మూడు సార్లు సాధారణ ములాఖత్‌ల సంఖ్య ఉన్న విషయం విదితమే. మరోవైపు.. చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లు కల్పించాలంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు టీడీపీ నేతలు. ఇక, ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.
హైకోర్టు.. చంద్రబాబు లాయర్లు సమయం కోరడంతో వాయిదా వేశారు న్యాయమూర్తి.. మరోవైపు, చంద్రబాబు హెల్త్ కండీషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.. చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.. మధ్యాహ్నం వాదనలు వినే అవకాశం ఉంది.