Breaking: నేడు హైదరాబాద్ లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు

Breaking: Chandrababu's medical examination in Hyderabad today
Breaking: Chandrababu's medical examination in Hyderabad today

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలై బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చారు. లక్షలాది అభిమానులు ఆయనకు దారి పొడవునా నీరాజనం పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి భార్య భువనేశ్వరితో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న బాబు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు.

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం చంద్రబాబు కోసం ఆయన నివాసంలో ఎదురుచూస్తు ఆయన వచ్చాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకునే అవకాశం ఉంది.

ఇక అంతకుముందు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన చంద్రబాబుకు ఏపీ టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని ఉమా, బోడే ప్రసాద్‌, పీతల సుజాత, టీడీపీ కార్యకర్తలు వీడ్కోలు పలికారు.