ఎక్సపర్ట్ల అభిప్రాయం ప్రకారం, అనేక రకాల కాన్సర్లు ఉన్నాయి, వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, సరైన ట్రీట్మెంట్ ఇంకా ఆహారంతో నయం చేయవచ్చు. అందులో ఒకటి బ్రెస్ట్ కాన్సర్ , స్త్రీలను సాధారణంగా ఎఫెక్ట్ చేసే కాన్సర్, కాబట్టి కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం అవసరం.
బ్రెస్ట్ అవెర్నెస్ కోసం మీ కళ్ళు ఇంకా చేతులతో బ్రెస్ట్ ఇన్స్పెక్షన్ చేసి బ్రెస్ట్ లుక్ లేదా ఫీల్‌లో ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బ్రెస్ట్ సెల్ఫ్ ఎక్సామినేషన్ అంటారు. మీరు బ్రెస్ట్ మార్పులను గమనించినట్లయితే, వీటిని మీ డాక్టర్‌తో మాట్లాడండి. బ్రెస్ట్ అవేర్నెస్ కోసం సెల్ఫ్ ఎక్జామ్ సమయంలో గుర్తించిన చాలా బ్రెస్ట్ మార్పులకు కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని మార్పులు బ్రెస్ట్ కాన్సర్‌ని సూచిస్తాయి.
చాలా మంది స్త్రీలు తమ బ్రెస్ట్‌లలో గడ్డలు, మార్పులను గమనిస్తారు, ఎందుకంటే వీటిలో కొన్ని మెనుస్ట్రువల్ సైకిల్ వల్ల సాధారణ మార్పులు. మీ బ్రెస్ట్‌లో మార్పు లేదా లంప్ ఉండటంతో ఎప్పుడు భయపడటానికి కారణం కాదు. ఉదాహరణకు, ప్రతి బ్రెస్ట్ క్రింద భాగంలో కొంచం ఫమ్నెస్ ఉంటుంది. మీ వయస్సు పెరిగే కొద్దీ మీ బ్రెస్ట్ల షేప్ ఇంకా ఫీల్ మారుతుంది.
చుట్టుపక్కల టిష్షు నుండి వేరుగా ఉండటం, గట్టిపడటం లేదా బ్రెస్ట్ లుక్, ఫీల్‌లో మార్పులు ఉండటం
మీ బ్రెస్ట్ చర్మంపై మార్పులు వస్తే, బ్రెస్ట్ నిపుల్ లోపలికి ఇన్వెర్సెగా నెట్టబడటం.రెడ్నెస్ , వెచ్చదనం, వాపు లేదా నొప్పి అలాగే దురద, పుండ్లు లేదా రాషేస్ ఇంకా బ్లడీ నిపుల్ డిస్చార్జ్.మీ డాక్టర్ బ్రెస్ట్ గడ్డలు, మార్పులను చెక్క్ చేయడానికి అవసరమైన టెస్ట్స్ ఇంకా ప్రోసిజర్లను రెకమెండ్ చేయొచ్చు, వీటిలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్, మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ ఇంకా బయాప్సీ ఉన్నాయి.
బ్రెస్ట్‌లో అయ్యే గడ్డలో బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణం కావచ్చు, కానీ అన్ని గడ్డలూ క్యాన్సర్ కాకపోవచ్చు. గడ్డకట్టడానికి ఇతర కారణాలు ఫైబ్రో అడెనోమాస్, లేదా సిస్ట్ ఉండటం. మేము మహిళలకు 20 సంవత్సరాల వయస్సు తర్వాత సెల్ఫ్ ఎక్జామినేషన్ను ఇంకా 45 సంవత్సరాల వయస్సు నుండి యనువల్ మామోగ్రామ్ టెస్ట్‌ను రెకమెండ్ చేస్తున్నాం. మారుతున్న లైఫ్ స్టైల్స్ , లేట్ మ్యారేజ్ ఇంకా ఎక్కువ వయస్సులో పిల్లలని కనటం వంటివి ఈ వ్యాధికి కొన్ని కారణాలు.
బ్రెస్ట్ కాన్సర్లను ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే నయం చేయవచ్చు. ఇలా చేస్తే బ్రెస్ట్‌ను తీసేయాలిసిన అవసరం లేదు. ఈ రోజుల్లో, బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్. బ్రెస్ట్ కాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి సెల్ఫ్ ఎక్జామినేషన్ ఇంకా స్క్రీనింగ్ చాలా అవసరం.కానీ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే, కాన్సర్ సెల్స్ శరీరంలో స్ప్రెడ్ అవొచ్చు. లివర్‌లోకి ప్రవేశిస్తే, పేషెంట్ కడుపు కుడి వైపున నొప్పి ఇంకా కొన్నిసార్లు జాండిస్ ఉండొచ్చు. ఇది ఎముకలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది.
ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్న లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, వాళ్ళు పాజిటివ్‌గా ఉండటం చాలా అవసరం. బ్రెస్ట్ కాన్సర్ పేషెంట్స్‌కు న్యూట్రిషన్ ఎక్కువగా ఉన్నా హెల్తీ డైట్ ఇవ్వాలి. ఎర్లీగా రాత్రి భోజనం చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని రీసర్చ్ చెప్పుతుంది. మీ ఆహారంలో తాజా పండ్లు ఇంకా పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్ ఇంకా రెడ్ మీట్‌ను తగ్గించండి, సరైన శరీర బరువును మెంటెయిన్ చేయాలి ఎందుకంటే ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్‌గా ఉండటం రిస్క్‌ను పెంచుతుంది.
మీరు బ్రెస్ట్‌లో కొత్త మార్పులను గమనించినట్లయితే మీ డాక్టర్‌తో చర్చించండి. బ్రెస్ట్ అవెర్నెస్ కోసం సెల్ఫ్ ఎక్జామినేషన్ సమయంలో గుర్తించిన చాలా బ్రెస్ట్ మార్పులకు బినైన్ కారణాలను ఉంటాయి, కొన్ని మార్పులు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వాటిని సూచిస్తాయి.