అర్ధరాత్రి ఇంటి ముందు భగ్గుమన్న బైకులు.. చూస్తుండగానే బూడిదైన బండ్లు.

రాత్రిపూట ఇంటిముందు బైకులు పార్క్‌ చేస్తున్నారా? జాగ్రత్త.. ఉదయానికి ఆ బండ్లు బూడిదైపోవచ్చు. అవును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఆబాద్ పేటలో ఇళ్ల బయట పార్క్ చేసిన నాలుగు మోటార్ బైక్ లకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టేసారు ఇమ్రాన్, ఫక్రుద్దీన్, ఆనంద్ అనే వ్యక్తులు ఎప్పటిలాగే ఇంటిముందు తమ బైకులు పార్క్‌ చేశారు. అర్ధరాత్రి ఇళ్ల బయట ఉంచిన మోటార్ బైక్ లకు నిప్పు పెట్టి వెళ్లిపోయారు దుండగులు.

ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో మెలకువ వచ్చిన వారు మంటలను ఆర్పి వేశారు. అప్పటికే బండ్లు మొత్తం దగ్ధమయ్యాయి. మెలకువ రావడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని , లేకపోతే మంటలు ఇంటిలోపలికి వ్యాపించి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.