“ఊరు పేరు భైరవకోన” రిలీజ్ డేట్ వచ్చేసింది …!

“ఊరు పేరు భైరవకోన” రిలీజ్ డేట్ వచ్చేసింది ...!
Cinema News

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా కి VI ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన రిలీజ్ డేట్ ని మేకర్స్ నేడు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ రావడం విశేషం.

“ఊరు పేరు భైరవకోన” రిలీజ్ డేట్ వచ్చేసింది ...!
Ooru peru Bhairavakona

ఈ సినిమా ని ఫిబ్రవరి 9, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, మరియు కుశీ రవి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.