తెలంగాణాలో కేసీఆర్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్ కు పోటీ ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ లు సరైన పోటీ ఇస్తున్నారు. తాజాగా కేసీఆర్ కు గట్టి షాక్ తగిలింది, BRS లో నిన్నటి వరకు కీలక నేతలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మల్కాజ్ గిరి నియోజకవర్గం BRSమాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు ఎమ్మెల్యే గా ఉన్న మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ లు కాంగ్రెస్ లో చేరారు.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సమక్షములో ఢిల్లీ లో కాంగ్రెస్ లోకి మారారు.అయితే మైనంపల్లి పార్టీ మారడానికి ప్రధాన కారణం కేసీఆర్ తన కుమారుడు రోహిత్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. ఇలా రోజు రోజుకు కేసీఆర్ బలహీనంగా మారిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.