బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి పండుగ సీజన్ సందర్భంగా కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్లాన్‌ను సమీక్షించి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ 1699రూపాయల వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్ పైన వేర్ అదనపు ప్రయోజనాలని ఇవ్వనుంది.
ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31లోపు రీఛార్జ్చేసే వినియోగదారులకు మాత్రమే ఇవ్వనుంది.ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉండగా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 455 రోజులకు పొడిగించింది. అక్టోబర్ మాసంలో రోజుకు 1.5 జీబీ అదనంగా ఇస్తూ మొత్తం 3.5 జీబీ డేటాను ఇస్తుంది. 90 రోజుల అదనపు ప్రయోజనాలు అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకి ఇంకా ఎక్కువ ఆఫర్లు ఇవ్వనుంది.