Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Bunny Is Coming With A New Angle In The DJ Movie
అల్లు అర్జున్ వరుసగా కమర్షియల్ సక్సెస్‌లు వచ్చినప్పుడు ప్రయోగం చేసేందుకు సిద్దం అవుతాడు. తాజాగా బన్నీకి వరుస సక్సెస్‌లు వచ్చిన నేపథ్యంలో ‘డీజే’ చిత్రంలో ప్రయోగాత్మకంగా నటించాడు. తన మునుపటి శైలికి పూర్తి విభిన్నంగా ‘డీజే’లో అల్లు అర్జున్ కనిపిస్తాడు. ముఖ్యంగా అయ్యగారి పాత్రలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తాడు. అల్లు అర్జున్ కాకుండా ఒక కొత్త నటుడిని అందులో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మరో పాత్రలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటాడు అని చెబుతున్నారు.
ప్రస్తుతం ‘డీజే’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వైపు బ్రహ్మణ సంఘాలు ఈ చిత్రంపై దుమ్మెత్తి పోస్తున్నా కూడా మరో వైపు నిర్మాత దిల్‌రాజు మాత్రం భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా బన్నీ సరికొత్త రికార్డును అందుకునే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బన్నీకి అన్ని విధాలుగా ‘డీజే’ చిత్రం ప్రత్యేకమైనదని, బన్నీలోకి కొత్త యాంగిల్‌ను తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తుందని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
మరిన్ని వార్తలు :