బురారీ కేసులో కీలక మలుపు !

Burari Death Case Investigation

జులై 1న దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 11 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యల కేసులో కీలక ఘట్టం పూర్తయ్యింది. 11 మంది మృతికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. బాటీయా కుటుంబంలో మొత్తం 11 మంది మృతి చెందగా వారిలో 10 మంది ఉరి వేసుకొని మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు తెలిపారు. దీంతో పోస్ట్ మార్టమ్ నివేదికపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, వారంతట వారే ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో తెలిపారు. పోలీసులు మాత్రం వీరందరూ కేవలం మూఢనమ్మకాల నేపథ్యంలోనే ఉరివేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మూఢ నమ్మకాలకు పరాకాష్టగా నిలిచిన ఈ ఆత్మహత్యల కేసులో పోలీసులు ఎటూ తెల్చలేకపోతున్నారు. ఇక దర్యాప్తు అధికారులే మానసికంగా క్రుంగిపోవడం ఈ కేసు తీవ్రతకు అడ్డం పడుతోంది.

పక్క గదిలో మృతిచెంది ఉన్న ఇంటి పెద్దావిడ నారయణీ దేవి… ఎలా చనిపోయానే విషయాన్ని మాత్రం నివేదకలో వెల్లడించలేదు. ఘటన స్థలంలో పోలీసులు ఓ పది అంశాలతో కూడిన చేతిరాత స్క్రిప్టును గుర్తించారు. అందులో రాసి ఉన్న అంశాలు… సంఘటనా స్థలంలోని పరిస్థితులను పోల్చి చూశారు. దాదాపు 25 చిన్నా, పెద్ద నోట్‌బుక్స్‌ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాటియా కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడానికి 15రోజుల ముందు నారాయణిదేవి మనవరాలైన ప్రియాంక నిశ్చితార్ధం నోయిడాకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీరుతో జరిగింది. అయితే ఆ యువకుడు ఈ ఘటనతో సంబంధం లేదని ఈ మూఢనమ్మకాలను కొట్టిపడేశాడు. దీంతో పోలీసులు అన్ని మార్గాల నుండి దర్యాప్తు చేస్తున్నారు.