రాయ్‌పూర్‌లో నుజ్జునుజ్జయిన బస్సు

రాయ్‌పూర్‌లో నుజ్జునుజ్జయిన బస్సు

ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున ఛత్తీష్‌ఘడ్‌, రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు వలసకూలీలను ఒరిస్సా, గంజాంనుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తోంది. శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి వద్దకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది.

దీంతో బస్సు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.