Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల శ్రీవారికి మరో విలువైన ఆభరణం కానుకగా వచ్చింది. తమిళనాడుకు చెందిన పారిశ్రామిక వేత్త తంగదొరై రూ. 2కోట్ల విలువైన బంగారు ఖడ్గం స్వామివారికి సమర్పించారు. తేని జిల్లా బోడినాయకలూర్ కు చెందిన పారిశ్రామిక వేత్త అయిన తంగదొరై స్వర్ణ ఖడ్గం కానుకగా ఇచ్చి మొక్కు చెల్లించుకున్నారు. తంగదొరై దంపతులు ఈ వేకువజామున సుప్రభాత సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులకు స్వర్ణసూర్య కఠారిని అందజేశారు.
ఆరుకిలోల మేలిమి బంగారంతో ఆభరణాన్ని తయారుచేయించినట్టు తంగదొరై దంపతులు తెలిపారు. 1989లో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి స్వర్ణసూర్య కఠారిని సమర్పించారు. ఆ తర్వాత శ్రీవారికి ఇలాంటి కానుక అందడం ఇదే తొలిసారి.