సెన్సేషన్ క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ

సెన్సేషన్ క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ సినిమా విడుదలకు ముందే సంగీతం పరంగా భారీ హిట్టయ్యింది. త్రివిక్రమ్ కు సాహిత్యం మీద ఉన్న పట్టుకు సంగీత దర్శకుడు థమన్ అందించిన బాణీలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

రికార్డు స్థాయి వ్యూస్ తో ఈ ఆల్బమ్ భారతదేశ సంగీత ప్రియులనే ఒక ఊపు ఊపింది. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ అయితే రికార్డులను తిరగరాసింది. ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట ఇప్పుడు ఖండాంతరాల సరిహద్దులను చెరిపేసింది.

ఈ పాటకు ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ మరియు మన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్ ను వేశారు. ఖాళీగా ఉండడంతో వార్నర్ కూడా ఈ మధ్యనే టిక్ టాక్ లో బిజీ అయ్యిపోయారు. అలా ఇప్పుడు ఈ వీడియో చేసి వదలగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని బట్టి బుట్ట బొమ్మ సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.