Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఇంకా ఏడాది మాత్రమె ఉండడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏకైక సమస్య మీద పోరాడేందుకు ఉన్న అన్ని పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఓ పక్క తెలుగు దేశం, మరో పక్క వైసేపీ, ఇంకో పక్క హోదా ఉద్యమం కోసమే లెఫ్ట్ పార్టీలతో జత కట్టిన జనసేన. ఇదంతా ఆంధ్రా రాజకీయం అయితే తెలంగాణా లో కూడా అధికార టీఆరెస్ ని ఓడించడానికి విపక్ష పార్టీలు అన్నీ జత కట్టాయి. అయితే అన్నిటిలోనూ ముఖ్యంగా పవన్ ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఎటూ హోదా విషయం లో కలిసి నడుస్తున్న లెఫ్ట్ పార్టీలు ఎన్నికల్లో అదీ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి జనసేనతో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక పొత్తు పెట్టుకునేందుకు తమకి వేరే ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో జనసేన లెఫ్ట్ పార్టీ ల మధ్య పొత్తు ఖాయమనే విశ్లేషకులు భావించారు.
గతంలో తెలంగాణా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనానితో భేటీ అయిన నేపథ్యంలో తెలంగాణాలో కూడా జనసేన లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఉండచ్చని అంతా భావించారు. అయితే ఈ పొత్తు వ్యవహారం మీద ఒక రకమయిన క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి, త్వరలో సీపీఎం మహాసభలు జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాదులోని అన్ని మీడియా సంస్థల అధిపతులు, సంపాదకులతో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు హాజరయ్యారు. ఈ భేటీలో విలేఖరుల ప్రశ్నలకు రాఘవులు సమాధానాలు చెప్పారు. అయితే జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనే అంశాన్ని ఓ విలేఖరి ప్రస్తావించగా రాఘవులు ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.
జనసేనతో పొత్తు అనేది పార్టీ నిర్ణయమని పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఎలాంటి ఆరోపణలు లేని నాయకుడు. ప్రజాసమస్యల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఖరిని చూపిస్తున్నారు. పైగా ఆయన నాయకత్వం పట్ల రాష్ట్ర యువతరంలో నమ్మకం ఉంది. ఆ పార్టీతో జతకట్టడం ద్వారా.. రాష్ట్రంలోని యువతరానికి సీపీఎం కూడా చేరువ అవుతుందనే నమ్మకం మాకుంది..అంటూ రాఘవులు పొత్తు కోసం పరితపిస్తున్న విధంగా మాట్లాడితే ఇందుకు భిన్నంగా తమ్మినేని మాట్లాడుతూ…కలిసి వస్తే జనసేనతో కలసి తెలంగాణలో పనిచేస్తామని అన్నారు.
అయితే తమకు ఇప్పటివరకు జనసేనాని విధివిధానాలపై ఎలాంటి స్పష్టత లేదని ఈ నేపథ్యంలో తాము ఏ రకంగా ఆయనతో కలిసి సాగుతామని ప్రకటిస్తామని ప్రశ్నించారు. ఒక వేళ నిజంగానే జనసేన తో లెఫ్ట్ పార్టీలు జత కడితే జనసేనకి ఉన్న వోట్లు లేని పవన్ అభిమానుల వల్ల సీపీఎంకు లాభమేమిటి ఉన్న నాలుగు వోట్లు వేసే జనసేన అభిమానులు అయినా సీపీఎం సిద్ధాంతాలను అర్థం చేసుకుని ఎంత మంది ఆదరిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇవన్ని బేరీజు వేసుకుని చూస్తే పవన్ తో లెఫ్ట్ పార్టీలు జత కట్టడం కష్టమే అనిపిస్తోంది.