‘c/o కంచరపాలెం’ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

C/O kancharapalem movie review

న‌టీన‌టులు: సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్,                                 ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్

ద‌ర్శ‌కుడు: వెంకటేశ్ మ‌హా
స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా
నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాడి & వ‌రుణ్ ఛాపేక‌ర్

CO-Kanchatapalem-telugu--mo

“కేరాఫ్ కంచరపాలెం “ అనే పేరుతో సినిమా. అందులో ఊరు,పేరు లేని నటీనటులు, కొత్త దర్శకుడు అనగానే ఎవరికైనా ఇదేదో పక్కా తమిళ్ సినిమా డబ్బింగ్ వెర్షన్ అనుకుంటారు. కానీ ఇందులో రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్ ఇన్ వాల్వ్ మెంట్ ఉందని తెలియగానే ఏదో విషయం ఉండి ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇక రిలీజ్ కి ముందే ఎన్నోసార్లు సెలెబ్రెటీల కోసం ఈ సినిమా ప్రదర్శించారు అనగానే ఆ ఆలోచన కాస్త కంచరపాలెం మీద నమ్మకం గా మారింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంచరపాలెం సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందో,లేదో చూద్దామా ?

 

CO-kancharapalem-movie

“ C /o కంచర పాలెం “ లో దర్శకుడు వెంకటేష్ మహా నాలుగు ప్రేమకథలు చెప్పాడు. అందులో ఓ జంట పదిపదకొండు ఏళ్ల పిల్లలది , ఇంకో జంట 20 ,22 ఏళ్ల మధ్య వుండే కుర్ర కారుది, ఇంకో జంట మూడు పదుల వయసులో కలిగే ప్రేమ, ఇక నాలుగో జంట 40 , 50 వయసులో ఉన్నవాళ్లు. ఈ ప్రారంభం చూడగానే ఇదేదో ప్రేమ కధ చిత్రంగా అనుకుంటే పొరపాటే. ఆ ప్రేమ జంటలు ,వారు ఉంటున్న కంచరపాలెం భావోద్వేగాన్ని ఆలా ఒడిసిపట్టి ప్రేక్షకుడి మనసు తట్టి గుండె లోతుల్లోకి వెళ్లి నవ్వించి,ఏడిపించి వదిలిపెట్టాడు దర్శకుడు మహా.అయితే చిత్రం ఏమిటంటే చూస్తున్నంతసేపు ఇది సినిమా అనిపించదు. మనకు బాగా తెలిసిన ఊరు, ఇళ్లలో సీసీ కెమెరా పెట్టి విత్ సౌండ్ అండ్ మ్యూజిక్ తో దాన్ని ఆస్వాదించినట్టు అనిపిస్తుంది. పసి వయసు ప్రేమ ఓ తండ్రి జీవితాన్ని బలితీసుకుంటుంటే ప్రేక్షకుడు స్క్రీన్ దగ్గరికి వెళ్లి ఆ సీన్ అలా జరగకుండా ఆపాలి అనుకుంటాడు. ఇక యవ్వన ప్రాయంలో కలిగే ప్రేమలో దూకుడు, త్యాగం చూసాక ఆ ఏజ్ లవ్ మీద ఎక్కడైనా తక్కువ అభిప్రాయం ఉంటే అది పోతుంది. ఇక ఓ వేశ్యని ప్రేమించే కుర్రోడు ఆమె ఆరోగ్యం కోసం కండోమ్ తెచ్చి ఇచ్చిన సీన్ , ఓ 20 ఏళ్ల అమ్మాయి తన తల్లి ప్రేమ పెళ్ళికి ముందుండి పోరాటం చేయడం ….ఇలా ఒకటేమిటి .ఎన్నో ,ఎన్నెన్నో సీన్స్ ప్రేక్షకుడి బూజు పట్టిన భావజాలాన్ని సమూలంగా తిరగదోడేస్తాయి.

CO-KANCHARAPALEM-MOVIES-TEL

ఇక ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే ఏ కమర్షియల్ సినిమాకు తీసిపోదు. మంచి సినిమాలు తీయాలంటే భారీ బడ్జెట్ ఉండాలి, ఆదర్శాల గురించి చెప్పాలంటే పెద్ద రేంజ్ నటులు ఉండాలి, ఇక ఓ మంచి విషయం లేదా ఫిలాసఫీ చెప్పాలంటే పాత్రలు ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలి, బరువైన డైలాగ్స్ ఉండాలి ఎన్నో సినిమాటిక్ విశ్వాసాల్ని పాతిపెట్టిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సామాన్యుడి జీవితంలో రసవత్తర మలుపులు ఉంటాయి, ఆ సామాన్యుడిలో అవసరానికి తగ్గట్టు నిలబడే ఓ హీరో ఉంటాడు, ఆ జీవితాల్ని చూస్తుంటే , కాస్త లోతుగా పరిశీలిస్తుంటే ఎందరో తత్వవేత్తలు చెప్పిన విషయాలు అలా దొర్లిపోవడాన్ని దర్శకుడు మహా చక్కగా కెమెరా ముందుకు తెచ్చాడు.

Rana kancharapalem movieఈ సినిమా విషయంలో జయాపజయాలు , బిజినెస్ రేంజ్ లాంటివి ఎప్పటికీ చిన్న చిన్న విషయాలే. ఒక్క సినిమాలో ప్రేమ , సందేశం , జీవితం , తత్వం ఇలా ఎన్నో పుష్పాల్ని ఓ మాలగా చేసిన ఘనత దర్శకుడు మహాదే . ఈ సినిమా నిర్మాతలు, ఆ పై అందులో భాగం అయిన సురేష్ ప్రొడక్షన్స్ కి అభినందనలు చెప్పాలి. ఇందులో నటించిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మణిశర్మ శిష్యుడువీస్వీకార్ అగస్త్య కూడా సరికొత్త సంగీతాన్ని ఇచ్చాడు.

kanacharapalem movie

తెలుగు బులెట్ పంచ్ లైన్ … c /o కంచర పాలెం ఓ న్యూ ఏజ్ సినిమా( ఆలోచనాస్థాయి)
తెలుగు బులెట్ రేటింగ్ … 3 .5 /5 .