మను రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

manu movie review

న‌టీన‌టులు: రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి
దర్శకుడు: ఫణీంద్ర నార్‌శెట్టి
నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌
సంగీతం: నరేష్ కుమరన్

manu

తెలుగులో కూడా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ సినిమాలు మొదలయ్యాయి. అప్పుడెప్పుడో కత్తి మహేష్ పెసరట్టు అంటూ మొదలెట్టిన ఈ ట్రెండ్ ని ఈరోజు రిలీజ్ అయిన మను కంటిన్యూ చేసింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు పల్లకి పెళ్లికూతురు, బ‌సంతి సినిమాలలో లీడ్ రోల్స్ లో కనపడిన రాజా గౌతం హీరోగా, షార్ట్ ఫిలిం హీరోయిన్ చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రమే ఈ మను. మొత్తంగా 115 మంది క్రౌడ్ ఫండింగ్‌తో రూపొందిన మొట్టమొదటి బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీ ఇది. మరి ఇంత డబ్బు పెడుతున్నారంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అందరూ భావించవచ్చు, మరి చిత్రం అందరి అంచనాలను అందుకుండా, లేదా అనేది రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ చూస్తే :

manu-movie
మ‌ను(రాజా గౌత‌మ్‌) ఈస్ట్ కోస్ట్ తీరంలో సియా అనే దీవిలో ఉండే ఒక ఆర్టిస్ట్ (పెయింట‌ర్‌). అనుకోకుండా అతని పెయింటింగ్ చూసి అతనితో ప్రేమలో పడుతుంది నీల(చాందిని), కానీ ఆ విషయం మనుకి తెలియదు. ఆమె తండ్రి ఒక డైమండ్ స్మగ్లర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. నీల ఓ ఫోటో స్టూడియో న‌డుపుతూ ఉంటుంది. మ‌ను ఆర్ట్ వ‌ర్క్ అంటే నీల‌కు ఇష్టం కానీ తనతో మను తప్పుగా ప్రవర్తించాడు అనుకుని పోరబడుతుంది. అ తర్వాత నిజం తెల్సుకుని ప్రేమలో పడుతుంది. అంతా బాగుంటుంద‌నుకునే స‌మ‌యంలో వీరి జీవితంలో అమ‌ర్, అక్బ‌ర్, ఆంటోని, రంగ‌(శ్రీకాంత్‌, జాన్ కొట్టొలి, మోహ‌న్‌భ‌గ‌త్‌, అభిరాం వ‌ర్మ‌) అనే నలుగురు ఎంట్రీ ఇస్తారు. దాంతో ఇద్ద‌రి జీవితాల్లో అనుకోని మ‌లుపులు సంభ‌విస్తాయి. ఇంత‌కు మ‌ను, నీల జీవితాల్లో తిరిగే మలుపులు ఏమిటి ? చివరికి ఇద్దరూ ఒక్కటవుతారా ? అనే విష‌యాల‌ను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

manu-movie

దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి రాసుకున్న కధ బాగానే ఉంది. కానీ దానిని తెరకెక్కించే విధానంలోనే దెబ్బ పడింది. ఒక వజ్రం చుట్టూ తిరిగే చిన్న కాన్సెప్ట్ తో దర్శకుడు రాసుకున్న కధ మను. సినిమా మొదలయ్యాక క్రైమ్ జోనర్ అని అనుకునేలోపే హారర్ లోకి అడుగుపెడుతుంది కధ. సినిమా కధంతా ఒక దీవిలో అది కూడా ప్లేగ్ వ్యాధి వలన వదిలివేయబడిన దీవి అని చెప్పడం సినిమాకి మిస్సయిన అతి పెద్ద లాజిక్. దర్శకుడు అనుకున్న లైన్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసే విషయంలో తప్పులు జరగడంతో సినిమా రిజల్ట్ పై దాని ప్రభావం పడింది. ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచన మంచిదే కానీ దానిని ప్రేక్షకులు తలకేక్కించుకోగలరా లేదా అనేది చుస్కోవాలిగా. చెప్పాలనుకునే పాయింట్ ఆడియన్స్ కి అర్ధంకాకుండా కన్ఫ్యూజన్ లో పడేస్తే థియేటర్లకు జనాలేమి వస్తారు. అలాగే సినిమాలో హీరో, హీరోయిన్ల చేత దర్శకుడు చెప్పించిన డైలాగ్ లు జనాన్ని కన్ఫ్యూజన్లో పడేస్తాయి. సుకుమార్ లాగా లాజిక్స్ తో మ్యాజిక్ చేద్దామని డైరెక్టర్ ప్రయత్నించి విఫలమయ్యాడు.

manu movie release
రాజా గౌత‌మ్ గత సినిమాలతో పోలిస్తే లుక్ ప‌రంగా, డైలాగ్ డెలివ‌రీ ప‌రంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక చాందిని చౌద‌రికి మంచి అభినయం ఉన్న పాత్ర వచ్చింది ఆమె కూడా పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. ఇక శ్రీకాంత్, జాన్ కొట్టొలి, అభిరామ్ వ‌ర్మ‌, మోహ‌న్‌భ‌గ‌త్ పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. విశ్వ‌నాథ్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, న‌రేశ్ కుమర‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ర‌ధాన‌ బ‌లం. మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను వివ‌రిస్తూ వస్తున్న‌ప్పుడు క‌న్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుది.  గంటన్నరలో చెప్పాల్సిన కథని మూడు గంటల పాటు సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నడా ? అనిపించక మానదు. సినిమా స్టార్టింగ్‌లో ఉన్న ఉత్సుకత తర్వాత తర్వాత క‌న‌ప‌డ‌దు. ఎడిటర్ కూడా దర్శకుడే అయినప్పుడు సినిమాని ఇంకెంత బాగా ప్రెజెంట్ చేయచ్చో కానీ ఈ సినిమాలో దర్శకుడిగా ప్రాణం పెట్టిన ఫణీంద్ర, ఎడిటర్ గా మొక్కుబడిగా చేసినట్టు అనిపించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా కాదు, రెగ్యులర్ రొటీన్ సినిమాలు చూసి విసుగెత్తిన జనానికి ఇది కాస్త ఊరట ఇవ్వచ్చు.
manu movie
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : మను—ఓన్లీ ఫర్ మూవీ లవర్స్ !
తెలుగు బులెట్ రేటింగ్ : 1.5 / 5